డెంగీ దోమలకు దోమలతోనే చెక్..

డెంగీ దోమలకు దోమలతోనే చెక్..

ఆరోగ్యంగా ఉండే చెట్టంత మనిషిని సైతం హరించే డెంగీ జ్వరాన్ని వ్యాపింప చేసే ఈజిప్ట్ ఎడీస్ దోమలకు అదే దోమలతోనే చెక్ పెట్టవచ్చని తాజాగా పరిశోధకులు కనిపెట్టారు. ఈజిప్టి దోమల్లోని వోల్బాచియా పిపియెంటిస్ అనే బ్యాక్టీరియా ఎడీస్ దోమలను అరికట్టగలదని భారతీయార్ వర్సిటీ పరిశోధకులు తేల్చారు. డెంగీతో పాటు జికా, చికున్ గున్యా వంటి వైరస్ లు కూడా ఎడిస్ దోమల ద్వారానే వ్యాపి చెందుతాయి. పిపియెంటిస్ బ్యాక్టీరియాతో దోమలు వైరస్ లను వ్యాప్తి చేయలేవని అదేవిధంగా తమ సంతానాన్ని పెంచుకోనివ్వకుండా కూడా ఈ బ్యాక్టీరియా నిరోధిస్తుందని పరిశోధకులు తెలిపారు.ఈ బ్యాక్టీరియా ఉన్న దోమలు ఇతర దోమలతో కలిస్తే వాటికి కూడా ఇది సోకుతుందని తద్వారా ఎడీస్ దోమలను నిర్మూలించవచ్చని పరిశోధకులు తేల్చి చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos