పైకి తేలుతున్న మృతదేహాలు..

పైకి తేలుతున్న మృతదేహాలు..

కచ్చులూరు సమీపంలో గోదావరి నదిలో బోటు మునిగిన ఘటనలో మంగళవారం మరో 14 మృతదేహాలు పైకి తేలాయి. ప్రమాదం చోటు చేసుకున్న కచ్చులూరు వద్దే మూడు మృతదేహాలు తీరానికి కొట్టుకుని వచ్చాయి. ఈ మూడింట్లో ఒకటి ఓ బాలుడిది కావడం సహాయక సిబ్బందిని సైతం కంటతడి పెట్టించింది. అలాగే మంటూరు, ధవళేశ్వరం బ్యారేజీ, పోలవరం మహానందీశ్వర స్వామి ఆలయం సమీపంలో రెండు చొప్పున మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. తాళ్లసీమ సమీపంలో మరో మూడింటిని గుర్తించారు. మంటూరు వద్ద లభించిన ఓ మృతదేహాన్ని గుర్తించారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. ప్యాంటు జేబులో లభించిన ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ల ఆధారంగా.. అతణ్ని నరసాపురానికి చెందిన బీఎస్ ఫణికుమార్ గా నిర్ధారించారు. నదీ ప్రవాహం ఉధృతంగా ఉన్నందున పలు మృతదేహాలు ధవళేశ్వరం బ్యారేజీ వరకు కొట్టుకెళ్లినట్లు గుర్తించారు. దీనితో మిగిలిన వారి కోసం ధవళేశ్వరం వరకూ గాలింపు చర్యలను చేపట్టారు. బోల్తా పడిన లాంచీని వెలికి తీస్తే.. మరి కొన్ని మృతదేహాలు చిక్కుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos