బిగ్‌బాస్‌ ఓట్లు కూడా అబద్దమేనా??

  • In Film
  • March 8, 2019
  • 130 Views
బిగ్‌బాస్‌ ఓట్లు కూడా అబద్దమేనా??

బిగ్‌బాస్‌ తెలుగు రెండవ సీజన్‌ విజేత కౌశల్‌పై వస్తున్న ఆరోపణలు ఇప్పుడప్పుడే నిలిచేలా లేవు. బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి విజేతగా బయటకు వచ్చాక పలు మీడియా ఛానెళ్లకు ఇచ్చిన ఇంటర్‌వ్యూలు, అభిమానులతో కౌశల్‌ జరిపిన సంభాషణలు అందులో కౌశల్‌ చెప్పిన విషయాలపై చెలరేగిన వివాదాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి.తాజాగా బిగ్‌బాస్‌ ఫైనల్‌లో కౌశల్‌కు వచ్చిన ఓట్లు కూడా అబద్దమేనని,గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులు తనను అప్రోచ్‌ అయ్యారంటూ కౌశల్‌ చేసిన వ్యాఖ్యలు అబద్దాలంటూ కొత్త ఆరోపణలు వినిపిస్తున్నాయి.బిగ్‌బాస్‌ కార్యక్రమం చరిత్రలోనే అత్యధిక ఓట్లతో గెలుపొందిన తమకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్‌ వచ్చిందని, అమెరికాలోని ఓ ప్రముఖ యూనివర్శిటీ తనకు డాక్టరేట్‌ ఆఫర్‌ చేసిందంటూ కౌశల్‌ చేసిన వ్యాఖ్యలను అబద్దాలుగా నిరూపించడానికి ఓ తెలుగు వార్తా ఛానెల్‌,అందులో పని చేస్తున్న ఓ సీనియర్‌ జర్నలిస్ట్‌ ప్రతీరోజూ గంటల తరబడి లైవ్‌ డిబేట్లు పెట్టిన విషయం తెలిసిందే.తాజాగా బిగ్‌బాస్‌ ఫైనల్‌లో తనకు 40 కోట్ల ఓట్లు వచ్చాయంటూ కౌశల్‌ చేసిన వ్యాఖ్యలు కూడా అబద్దమేనంటూ మరో ఆరోపణ వినిపిస్తోంది.బిగ్‌బాస్‌ కార్యక్రమం చరిత్రలో ఎవరికి రానంతగా 40 కోట్ల ఓట్లు తనకు వచ్చాయని ఇంతపెద్ద సంఖ్యలో ఓట్లు రావడంతో గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వాల్డ్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు తమను కలిశారంటూ కౌశల్‌ చేసిన వ్యాఖ్యలు కూడా అబద్దాలేనని వార్తలు వినిపిస్తున్నాయి.దీనిపై కూడా సదరు ఛానెల్‌,ఆ యాంకర్‌ మరో వారం రోజుల పాటు డిబేట్‌ పెడతారేమో.అయినా రాష్ట్రంలో,దేశంలో తిష్టవేసిన పేదరికం, నిరక్ష్యరాస్యత, ఆకలి, నిరుద్యోగం,తాగునీటి సమస్యలు,ముఖ్యంగా రైతుల అవస్థలు ఇవేమి సదరు యాంకర్‌కు పట్టనట్లు కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో కౌశల్‌ తరహాలో(యాంకర్‌,ఛానెల్‌ దృష్టిలో) ఎన్నో అబద్దాలు, బూటకపు హామీలు,వాగ్దానాలు చేసి గెలిచికా వాటిని విస్మరించిన రాజకీయ నేతలను ప్రశ్నించే దమ్ము,తీరిక లేక చివరకు ఇలా ప్రజలకు నయాపైసా ఉపయోగం లేని ఎందుకు పనికిరాని వాటిపై రోజుల తరబడి డిబేట్లు పెట్టి,సవాళ్లు చేసుకొని సదరు ఛానెల్‌,ఆ యాంకర్‌ సాధించిందేమిటో వారికే తెలియాలి..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos