నా ప్రాణాలకు ముప్పు

నా ప్రాణాలకు ముప్పు

న్యూ ఢిల్లీ : తన ప్రాణాలకు ముప్పు ఉందని ఫేస్బుక్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్ అంకిదాస్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీనిపై ప్రాథమిక సమాచార నివేదికను దాఖలు చేయాలని కోరారు. అమెరికాకు చెందిన అంతర్జాతీయ పత్రిక వాల్స్ర్టీట్ జర్నల్ మన దేశంలో ఫేస్బుక్, వాట్సాప్ను బీజేపీ, ఆర్ఎస్ఎస్ కంట్రోల్ చేస్తున్నాయని రాసింది. అధికార పార్టీకి అనుకూలంగా ఫేస్బుక్ తన పాలసీలనే మార్చుకుందని బీజేపీకి హిందువాదానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని పేర్కొంది. దీని గురించి కొందరు భాజపా నేతలు చేసిన వ్యాఖ్యల్నీ ఆ కథనంలో ప్రచురించారు. తెలంగాణలోని ఏకైక భాజపా శాసనసభ్యుడు టి.రాజాసింగ్ లోధ్ను ప్రముఖంగా ప్రస్తావించింది. ‘వివాదాస్పద వీడియోలు, పోస్టుల విషయంలో రాజాసింగ్ కరడుగట్టిన కాషాయ నేత. ఆయన ఫేస్బుక్ పేజీలో హింసను ప్రేరేపించే పోస్టులున్నా ఫేస్బుక్ చర్యలు తీసుకోలేదు. ఇందుకు కారణం.. భాజపా పట్ల అంకిదాస్కు ఉన్న భయమే!’’ అని వ్యాఖ్యానించింది. ‘కర్ణాటక ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే(బీజేపీ) కూడా తన ఫేస్బుక్, ట్విటర్ ఖాతాల్లో కరోనా జిహాద్ అని ఒక వర్గానికి వ్యతిరేకంగా పోస్టులు చేశారు. ట్విటర్ వెంటనే తొలగించింది. ఫేస్బుక్ మాత్రం మేము వివరణ కోరాక కొన్ని పోస్టులను తీసేసింది. కొందరు సంఘ్ పరివార్ నేతలు లవ్ జిహాద్పై పెట్టిన పోస్టులు హింసను ప్రేరేపించేలా ఉన్నా వాటిని ఫేస్బుక్ తొలగించలేద’ని తప్పుబట్టింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos