నయా జాతిపిత నరేంద్ర మోది

నయా జాతిపిత నరేంద్ర మోది

ముంబై: మన జాతిపిత ఎవరంటే మహాత్మాగాంధీ అని చిన్నపిల్లలూ ఠక్కున చెప్పేస్తారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సతీమణి అమృత ఫడ్నవిస్ కు మాత్రం దేశ ప్రధాని నరేంద్ర మోదీయే జాతిపిత. ఇది వివాదాల తుట్టెను కదిపింది. ప్రధాని మోదీ పుట్టిన రోజు మంగళవారం ఆమె ట్విటర్లో ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు.దీనికి కొన్ని విశేషణాల్ని జోడించటం వివాదాలకు కారణమైంది. ‘జాతిపిత నరేంద్ర మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. సమాజం అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించేందుకు ఆయనే మాకు స్ఫూర్తి’ అని వ్యాఖ్యానించారు. ఆ మరుక్షణం నుంచే ఆమెకు నెటిజన్ల నుంచి విమర్శల తాకిడి మొదలయ్యింది. ‘మన జాతిపిత మహాత్మాగాంధీ. ఇప్పుడు కొత్త జాతిపిత వచ్చారు. నరేంద్ర మోదీ జాతిపిత ఎప్పుడయ్యారు? ఎలా అయ్యారు? నిరుద్యోగం పెరిగిపోయి, ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంటే. సమాజంలో మీరు చెప్పిన అభివృద్ధి ఏం జరిగింది?.’అని నెటిజన్లు ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. ‘‘గుజరాత్ కసాయి జాతిపిత ఎప్పుడయ్యారు?’’ అంటూ మరొకరు ప్రశ్నించారు. ‘మీరు ఏ దేశం గురించి మాట్లాడుతున్నారో తెలియదు మేడం. కానీ నా దేశంలో జాతిపిత మాత్రం మహాత్మాగాంధీ’ అని మరొకరు తేల్చిచెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos