ఇంకా ఆరు నెలల గడువు ఉంది…

ఇంకా ఆరు నెలల గడువు ఉంది…

ఢిల్లీ : మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత తొలిసారిగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్పందించారు. గవర్నర్ అన్నిపార్టీలకు చాలా సమయం ఇచ్చారని, ఏ పార్టీ కూడా ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు రాలేదని ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ చెప్పారు. గవర్నర్ 18 రోజుల పాటు అన్ని పార్టీలకు సమయం ఇచ్చారని చెప్పారు. ఏ రాష్ట్రానికి ఇన్ని రోజులు సమయం ఇచ్చిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటే ఇప్పటికీ ఆయా పార్టీలకు ఆరు నెలల గడువు ఉందని చెప్పారు. శివసేనతో పొత్తు దెబ్బతినడంపై అమిత్ షా వివరణ ఇస్తూ, ఎన్నికలకు ముందే ప్రధాని మోదీ, తాను అనేకసార్లు బహిరంగ సభల్లో కూటమి విజయం సాధిస్తే దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించామని చెప్పారు. అప్పడు ఎవరూ అభ్యంతరం చెప్పలేదని, ఇప్పుడు కొత్త డిమాండ్లతో వారు (శివసేన) ముందుకు వచ్చారని చెప్పారు. ఆ డిమాండ్లు తమకు ఆమోదయోగ్యం కాదని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos