లండన్ వెళ్లడం కోసం పెళ్లి చేసుకున్నా..

  • In Film
  • June 4, 2019
  • 119 Views
లండన్ వెళ్లడం కోసం పెళ్లి చేసుకున్నా..

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అమితాబ్‌ బచ్చన్‌కు ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది.జంజీర్‌,డాన్‌,షోలే వంటి భారతీయ చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ చిత్రాల్లో నటించిన అమితాబ్‌కు ఇప్పటికీ విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది.ఇక సినిమాల్లో అప్పుడప్పుడే స్టార్‌గా ఎదుగుతున్న సమయంలో జయాబచ్చన్‌ను ప్రేమవివాహం చేసుకున్నారు.అమితాబ్‌,జయల వివాహం జరిగి 46 ఏళ్ల గడిచిన అనంతరం తాజాగా తన పెళ్లికి సంబంధించి ఆసక్తికర విషయాన్ని అమితాబ్‌ వెల్లడించారు.అమితాబ్ కెరీర్ లో అతి పెద్ద హిట్ చిత్రాల్లో ‘జంజీర్’ ఒకటి. ఆ సినిమా సక్సెస్ అయితే తన మిత్రుల్ని లండన్ టూర్ కి తీసుకెళ్తానని మాట ఇచ్చాడట.సినిమా అనుకున్నదానికంటే పెద్ద సక్సెస్ కావడంతో టూర్ కి రెడీ అయ్యారట. తన మిత్రులతో పాటు జయను కూడా వెంట తీసుకెళ్లాలని అనుకున్నాడట. అప్పటికే ఆమెతో ప్రేమలో ఉన్నాడు అమితాబ్. కానీ ఆమెతో పెళ్లి కాకుండా విదేశాలకు తీసుకువెళ్లడానికి అమితాబ్ తండ్రి ఒప్పుకోలేదట. దీంతో అప్పటికప్పుడు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకపోయినా తండ్రి మాట ప్రకారం పెళ్లి చేసుకొని ఆ మరుసటిరోజే ఆమెని, తన స్నేహితులను తీసుకొని విమానం ఎక్కేసినట్లు అమితాబ్ చెప్పుకొచ్చాడు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos