భాగ్యనగరి మకుటంలో మరో కలుకితు రాయి..

భాగ్యనగరి మకుటంలో మరో కలుకితు రాయి..

అంతర్జాతీయ కామర్స్ దిగ్గజం అమెజాన్ హైదరాబాద్‌ నగరంలో ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్‌‌ బుధవారం ప్రారంభించింది.సుమారు 30 లక్షల చదరపు అడుగుల స్థలంలో 15 అంతస్తులతో  పూర్తిగా ఆధునిక నమూనాలో సకల వసతులతో నిర్మాణం చేపట్టారు.దాదాపు పదేళ్ల క్రితమే హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన అమెజాన్ సంస్థ తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలతో పాటు రాష్ట్రంలో ఉన్న అనుకూలతలను పరిగణనలోకి తీసుకుని రూ.400 కోట్ల పెట్టుబడితో ప్రపంచంలోనే అతి పెద్ద క్యాంపస్‌ను నిర్మించాలని నిర్ణయించింది.దీనికి తెలంగాణ ప్రభుత్వం పది ఎకరాల భూమిని కేటాయించింది.ఈ నేపథ్యంలో 2016 మార్చి 31అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అతిపెద్ద క్యాంపస్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బిజినెస్ డెవలప్‌మెంట్‌తో పాటు సాఫ్ట్‌వేర్ రూపకల్పన, వాణిజ్య విస్తరణ కార్యాచరణకు క్యాంపస్‌ కేంద్రం కానుంది.ఇప్పటికే మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబీఎం, ఒరాకిల్ వంటి బహుళజాతి సంస్థలతో పాటు ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, టెక్ మహేంద్ర వంటి దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీలు హైదరాబాద్‌లో కార్యకలాపాలు నడుపుతున్నాయి.తాజాగా అమెజాన్ క్యాంపస్‌ ప్రారంభోత్సవం తర్వాత తెలంగాణలో కొత్త పరిశ్రమల స్థాపనకు,పెట్టుబడులకు ఊతం లభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos