ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్యే అరెస్ట్

ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్యే అరెస్ట్

డెహ్రాడూన్: లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్యే అమన్మణి త్రిపాఠీ, ఆయన 12 మంది అనుచరులను రిషికేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి బద్రీనాథ్ వెళుతున్న త్రిపాఠి, ఆయన అనుచరుల మూడు కార్లను తొలుత ఉత్తరాఖండ్లోని గౌచార్ జిల్లా అధికారులు అడ్డుకున్నారు. నౌతన్వా శాసనసభ్యుడి జోక్యంతో డెహ్రాడూన్ అధికారుల ద్వారా వారికి అనుమతి పత్రం ఇప్పించారు. కర్ణప్రయాగ వరకు వెళ్లాక అక్కడి అధికారులు మళ్లీ త్రిపాఠి బృందాన్ని అడ్డుకున్నారు. బద్రీనాథ్ ప్రవేశ ద్వారాలు ఈ నెల 15 తర్వాత తెరుచుకుంటాయనీ.. కాబట్టి ముందుకు వెళ్లనివ్వబోమని తేల్చిచెప్పారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన ఎమ్మెల్యే సదరు అధికారులపై చిందులు తొక్కారు. ఆయనను బలవంతంగా అక్కడి నుంచి వెనక్కి పంపేశారు. తీరా ఆయన వాహనాలు రిషికేశ్ వద్దకు రాగానే ఈ సారి వ్యాసి పోలీసులు అడ్డుకున్నారు. ఒక్కో కారులో ముగ్గురికంటే ఎక్కువమంది ఉండడం, కనీసం మాస్కులు కూడా ధరించక పోవడంతో అరెస్టు చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. ఐపీసీలోని పలు సెక్షన్లతో పాటు, అంటువ్యాధుల నివారణ చట్టం, విపత్తు నిర్వహణ చట్టం కింద వారిపై కేసులు నమోదు చేశారు. అనంతరం వ్యక్తిగత పూచికత్తుపై ఎమ్మెల్యే, ఆయన పరివారాన్ని విడుదల చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos