అలోక్ కుమార్ ఇంట్లో సీబీఐ అధికారుల సోదాలు

అలోక్ కుమార్ ఇంట్లో సీబీఐ అధికారుల సోదాలు

బెంగళూరు: చాటుగా టెలిఫోన్ సంభాషణలు విన్న కేసులో నగర మాజీ పోలీసు కమిషనర్ అలోక్ కుమార్ ఇంట్లో సీబీఐ అధికారులు గురు వారం సోదాలు చేసారు. అలోక్ కుమార్ ప్రస్తుతం రాష్ట్ర రిజర్వు పోలీసు అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కుమారస్వామి ప్రభుత్వం తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొన్నపుడు ఆయన తమ ఫోన్లను ట్యాప్ చేశారని పలువురు జేడీఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఓ ఫోన్ సంభాషణ క్లిప్ మాధ్యమాల్లో ప్రసారమైంది. ఇందులో ఓ ఐపీఎస్ అధికారి, కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్, మాజీ మంత్రి హెచ్.డీ. రేవణ్ణ తదితరులు పేర్లు ఉన్నాయి. దరిమిలా యడ్యూరప్ప ప్రభుత్వం ఈ కేసు విచారణ బాధ్యతను సీబీఐకి అప్పగించింది. కుమారస్వామి ప్రభుత్వం తనతోపాటు మరో 300 మంది నాయకుల ఫోన్లను ట్యాప్ చేసిందని అన్హరత వేటుకు గురైన జేడీఎస్ ఎమ్మెల్యే ఏహెచ్ విశ్వనాథ్ ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని కోరారు. ఈ అక్రమం సూత్రధారి కుమారస్వామియేనని భాజపా నేతలు ఆరోపించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos