మరో యువతిపై హత్యాచారం

మరో యువతిపై హత్యాచారం

అలీగఢ్: ఇక్కడకు సమీపిలోని లోని ఓ గ్రామంలో 17ఏళ్ల ఎస్సీ యువతిపై ఓ దుండగుడు ఆదివారం హత్యాచారానికి పాల్పడినట్లు బుధవారం తెలిసింది. అమ్మమ్మతో కలిసి నివసిస్తున్న ఆ యువతి వృద్ధురాలినీ పొలాలకు తీసుకువెళుతుండేది. ఆదివారం ఉదయం ఆ యువతే గొర్రెలను మేతకు తీసుకెళ్లింది. సూర్యాస్తమయం అయినా ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. ఆ రోజు సాయంత్రం దుస్తులు చినిగిపోయి అర్ధ నగ్నంగా గోధుమ చేనులో శవమై కనిపించింది. బాధితురాలిని గొంతు నులిమి చంపినట్లు శవ పరీక్షలో తేలిందని అలీగఢ్ ఎస్పీ మునిరాజ్ తెలిపారు. శరీరంపై గాయాలైనట్లు తెలిపిన ఆయన.. ఆమె చర్మంపై గోళ్లుతో రక్కిన్నట్లు ఆనవాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు 12 మంది అనుమానితులను ప్రశ్నించినట్లు వెల్లడించారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos