జనసేన టికెట్‌ కోసం అలీ ప్రయత్నం?

జనసేన టికెట్‌ కోసం అలీ ప్రయత్నం?

లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు కూడా ఎన్నికలు రావడంతో రాజకీయ పార్టీల నేతలతో పాటు పలువురు నటీనటులు కూడా రాజకీయాలపై ప్రత్యేక దృష్టి సారించార.అందులో ప్రముఖ హాస్యనటుడు అలీ కూడా ఒకరు.తనకు ఏ పార్టీ టికెట్‌ ఇచ్చి గెలిచాక మంత్రి పదవి ఇస్తోందో ఆ పార్టీలోకి చేరడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ తన మనసులో మాట బయటపెట్టిన అలీ వైసీపీ, తెదేపా, జనసేన పార్టీల అధినేతలతో సమావేశమై చివరకు వైసీపీ కండువా కప్పుకొన్నారు. అయితే లోక్‌సభతో పాటు శాసనసభ ఎన్నికల అభ్యర్థులను కూడా ఒకేసారి ప్రకటించిన వైసీపీ అధినేత జగన్‌ రెండు జాబితాల్లో అలీకి చోటివ్వలేదు.అలీకి టికెట్‌ ఇవ్వకపోవడం వెనుక చాలా కారణాలు ఉన్నట్లు సమాచారం.అంతర్గతంగా చేయించుకున్న సర్వేలో అలీ గెలుపు అసాధ్యమని తేలడంతో వైసీపీ అధినేత జగన్‌ అలీకి టికెట్‌ ఇవ్వలేదని సమాచారం.వైసీపీలో చుక్కెదురు కావడంతో ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేసి తీరాలని నిర్ణయించుకున్న అలీ అందుకోసం తన స్నేహితుడు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు ఫోన్‌ చేసి టికెట్‌ కోసం విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.అయితే ఇప్పటికే ఆలస్యమైందని అభ్యర్థులను ప్రకటన చేశామని మిగిలిన నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులను ఎంపిక చేసేశామని ఈ సమయంలో ఏమి చేయలేనంటూ పవన్‌ కళ్యాణ్‌ చేతులెత్తేశాడట.దీంతో చివరి ప్రయత్నంగా ఇటీవల జనసేనలో చేరి నరసాపురం ఎంపీ టికెట్‌ దక్కించుకున్న మెగాబ్రదర్‌ నాగబాబును ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాడట అలీ..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos