ఎకో ఫ్రేమ్స్‌ పై అలజడి

ఎకో ఫ్రేమ్స్‌ పై అలజడి

న్యూఢిల్లీ: అమెజాన్ సంస్థ రెండు రోజుల కిందట విపణిలోకి విడుదల చేసిన ఎకో ఫ్రేమ్స్- అలెక్సా స్మార్ట్ గ్లాసెస్ పట్ల వినియోగదారుల్లో ఆందోళన చెలరేగింది. వీటిని ధరించిన వారు ఇతరులతో చేసిన సంభాషణను కళ్ల జోడుకున్న రెండు మైక్రో ఫోన్ల సాయంతో అమెజాన్ కంపెనీ కార్యాయలం టేపుల్లో రికార్డు అయ్యే అవకాశం ఉండడమే దీనికి ప్రధాన ఆందోళన కారణం. ఇందువల్ల తమ వ్యక్తి గత జీవితం దెబ్బతింటుందన్నది వాదించారు. గతంలో అమెజాన్ విడుదల చేసి అలెక్సా ఎకో స్పీకర్ విషయంలోనూ ఇలాంటి ఫిర్యాదులే వచ్చాయి. అమెరికాలో ఓ జంట తమ పడక గది ముచ్చ ట్లను కూడా అలెక్సా స్పీకర్ రికార్డు చేసిందని కోర్టుకు ఎక్కారు. మాటలను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం అలెక్సా ఎకో స్పీకర్లో ఉంది. దీన్ని అంతర్జా లంతో అనుసంధానం చేసినపుడు మన మాటలకు స్పందిస్తుంది. మనకు కావాల్సిన పాటలు, వార్తలు లేదా జోకులు వినిపించమని కోరితే అలెక్సా యాప్ ఇంటర్నెట్లోని వాటి వనరులతో అనుసంధానించిన వినిపిస్తుంది. మన సూచనల్ని స్వీకరిస్తున్నందున అది మన మాటలను వినే అవకాశం ఉంది. మనం కమాండ్ ఇచ్చినప్పుడు మాత్రమే స్పందించి మిగతా సమయాల్లో అదంతట అదే ఆఫ్ అయ్యే పద్ధతి లేనందున మన మాటలను, ముచ్చట్లను కంపెనీ టేపుల్లో రికార్డు చేసే అవకాశం ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos