అలెగ్జాండర్ కే దిక్కు లేదు.. మీరెంత?

అలెగ్జాండర్ కే దిక్కు లేదు.. మీరెంత?

ముంబై: మహారాష్ట్రలో భాజపా-శివసేనల మధ్య రాజుకున్న అగ్నికి శివసేన నేత సంజయ్ రౌత్ చేసిన ట్వీట్ ఆజ్యాన్ని పోసింది. ‘సాహిబ్..మీ అహంకారం మా వద్ద చూపించకండి. అలెగ్జాండర్ వంటి ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయారు’ అని ట్వీట్ చేశారు. అంతటితో ఆగ కుండా విలేఖరులతోనూ మాట్లాడారు. ‘కచ్చితంగా శివసేన నాయకుడే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడు. కావాలంటే రాస్కోండి ఉద్ధవ్ ఠాక్రే ఒక్కమాట చెప్పాలేగానీ మా పార్టీ నేత సీఎం అవుతాడు. మెజార్టీలేని వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ధైర్యం చేయరు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని శివసేన అనుకుంటే అందుకు తగినంత మంది ఎమ్మెల్యేలను పొందగలదు రాష్ట్రంలో స్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు. 50-50 ఫార్ములాతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతోనే ప్రజలు ఎన్నికల్లో అటువంటి తీర్పు ఇచ్చారు. శివసేన నుంచే ముఖ్యమంత్రి కావాలని వారు అనుకుంటున్నార’ని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాల్లో భాజపా 105, శివసేన 56సీట్లు గెలుచుకుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos