విలన్‌ అవకాశం అలా చేజారిందట..

విలన్‌ అవకాశం అలా చేజారిందట..

షోయబ్‌ అక్తర్‌ క్రికెట్‌లో పరిచయం అక్కర్లేని పేరు.గరుడ పక్షిలా దూసుకువస్తూ గంటకు 160 కిలోమీటర్ల వేగంతో విసిరే బంతులను ఎదుర్కోవాలంటే దిగ్గజాలైన బ్యాట్‌మెన్లు భయంతో వణికిపోయేవారు.అంతలా బ్యాట్‌మెన్స్‌ను భయపెట్టిన అక్తర్‌కు బాలీవుడ్‌లో విలన్‌గా నటించే అవకాశం వచ్చిందట.అయితే క్రికెట్‌పై ఇష్టంతో బాలీవుడ్‌ ఆఫర్‌ను తిరస్కరించాడు.2006లో దర్శకుడు అనురాగ్‌ బసు ఇమ్రాన్‌ హష్మి,కంగనా రనౌత్‌లతో తెరకెక్కించిన గ్యాంగ్‌స్టర్‌ చిత్రంలో నటుడు షైని ఆహుజ పోషించిన విలన్‌ పాత్ర కోసం అక్తర్‌ను తీసుకోవాలని దర్శకుడు అనురాగ్‌,నిర్మాత మహేశ్‌భట్‌ భావించారట.ఇదే విషయాన్ని అక్తర్‌ వద్ద ప్రస్తావించగా క్రికెట్‌తో బిజీగా ఉండడంతో ఆఫర్‌ను తిరస్కరించాడట.ఈ విషయాన్ని అక్తర్‌ కూడా ఒక సందర్భంలో వెల్లడించారు.ఒకవేళ అక్తర్‌ కనుక ఆఫర్‌ను అంగీకరించి ఉంటే బంతులతో బ్యాట్‌మెన్స్‌ను భయపెట్టిన అక్తర్‌ బాలీవుడ్‌ ప్రేక్షకులను భయపెట్టే అవకాశం లభించి ఉండేది.అక్తర్‌ రూపం,ఆహార్యం,శరీరాకృతి కూడా విలన్‌ పాత్రలకు సరిగ్గా సరిపోయే విధంగా ఉండడంతో దర్శకనిర్మాతలు అక్తర్‌ను సంప్రదించి ఉంటారేమో..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos