మోది చిత్రానికి పాటలు రాయలేదు

ముంబై: వివేక్ ఒబెరాయ్ నటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్కి తాను గీతాల్నిరాయ లేదని ప్రముఖ గేయ రచయిత జావెద్ అక్తర్ శనివారం ట్వీట్‌లోస్పష్టీకరించారు. ‘ఈ సినిమా ప్రచార పత్రంలో నా పేరు ఉండడంతో నేను దిగ్బ్రాంతికి గురయ్యాను. నేను ఈ చిత్రం కోసం ఎలాంటి పాటలు రాయలేదు’’ అని పేర్కొన్నారు. ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోదీ పాత్రలో వివేక్ ఒబెరాయ్ నటించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos