ఏది సత్యం అక్షయా?

ఏది సత్యం అక్షయా?

ముంబై: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ చుట్టు పౌరసత్వ వివాదం ముసురుకుంటోంది. కెనడా దేశ పౌరసత్వాన్ని కలిగి ఉన్నందున లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయలేక పోయారు. తనకు కెనడా పౌరసత్వం ఉన్న మాట నిజమని అంగీకరించిన ఆయన. మాతృ దేశమైన భారత్ పై ఎనలేని మక్కువన్నారు. కెనడా పౌరసత్వం విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆక్రోశించారు.గత ఏడేళ్లలో తాను ఎన్నడూ అక్కడకుఇక్కడే నివశించి అన్ని రకాల పన్నులు చెల్లిస్తున్నానని చెప్పారు. దీనికి పూర్తి వ్యతిరేకంగా ఆయన పేర్కొన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో సంచరిస్తోంది. కెనడా టోరంటోలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న అక్షయ్‌కుమార్‌.. ‘మీకో విషయం తప్పకుండా చెప్పాలి. టోరంటో నా సొంతూరు. బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ నుంచి రిటైరయ్యాక నేను ఇక్కడికే వచ్చి స్థిరపడతాను’ అని పేర్కొన్నారు. అక్షయ్‌కుమార్‌ ద్వంద్వ వైఖరికి ఇది నిదర్శనమని కొందరు విమర్శించారు. ఎప్పుడో అన్న మాటల ప్రాతిపదికగా అక్షయ్‌ దేశభక్తిని శంకించడం సరికాదని మరి కొందరి అభిప్రాయం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos