రాజ్య‌స‌భ ఎన్నిక‌ల ఓటింగ్..ఎమ్మెల్యేలకు కాషాయ పార్టీ బెదిరింపులు

రాజ్య‌స‌భ ఎన్నిక‌ల ఓటింగ్..ఎమ్మెల్యేలకు కాషాయ పార్టీ బెదిరింపులు

లఖ్నవు : రాజ్యసభ ఎన్నికల్లో కాషాయ పార్టీ అక్రమాలకు తెరలేపిందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. యూపీలోని పది స్ధానాలకు మంగళ వారం ఓటింగ్ జరుగుతున్న క్రమంలో బీజేపీపై అఖిలేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తమకు అనుకూలంగా ఓటు వేయాలని ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని అఖిలేష్ ఆరోపించారు. పెద్దల సభకు జరుగుతున్న ఎన్నికల్లో కాషాయ పార్టీ అవకతవకలకు పాల్పడటం విచారకరమని అన్నారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో అఖిలేష్ సోమవారం పార్టీ ఎమ్మెల్యేలకు విందు ఏర్పాటు చేయగా, విందుకు మనోజ్ పాండే హాజరు కాలేదు. ఇక యూపీలో జరుగుతున్న పది స్థానాల కోసం 8 మంది బీజేపీ నుంచి, సమాజ్వాదీ పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు.ఇక రాయ్బరేలీలోని ఉంచహార్ నియోజకవర్గం నుంచి మనోజ్ పాండే ఎమ్మెల్యేగా ఉన్నారు. గత అఖిలేశ్ సర్కారులో ఆయన మంత్రిగా చేశారు. సోమవారం జరిగిన ఎస్పీ భేటీకి ఆ పార్టీకే చెందిన 8 మంది నేతలు హాజరుకాలేదు. మనోజ్తో పాటు ముకేశ్ వర్మ, మహారాజి ప్రజాపతి, పూజా పాల్, రాకేశ్ పాండే, వినోద్ చతుర్వేది, రాకేశ్ ప్రతాప్ సింగ్, అభయ్ సింగ్ ఆ మీటింగ్కు వెళ్లలేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos