అఖిలేశ్ యాదవ్‌ అరెస్ట్

అఖిలేశ్ యాదవ్‌ అరెస్ట్

లక్నో : దేశ వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా సోమవారం ఇక్కడ నిరసన ప్రదర్శన జరిపిన మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ను పోలీసులు అరెస్టు చేసారు. వందలాది మంది కార్యకర్తలనూ అదుపులోనికి తీసుకున్నారు.దరిమిలా ‘మా అంతిమ శ్వాస వరకూ అన్నదాతల కోసం పోరాడుతూనే ఉంటాం. మేము చేపట్టిన కిసాన్ యాత్ర ను అడ్డుకోడానికి ప్రభుత్వాలు అన్ని ప్రయత్నాలూ చేసింది. రైతుల ఆవేదనను వ్యక్తం చేయడానికి ప్రయత్నించిన అధ్యక్షుడు అఖిలేశ్ను చట్ట వ్యతిరేకంగా అదుపులోకి తీసుకున్నారు’ పార్టీ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ఉత్తర ప్రదేశ్ పోలీసులకు వ్యతిరేకంగా అఖిలేశ్ యాదవ్ లోక్సభ సభాపతి ఓం బిర్లాకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసారు. ‘లోక్సభ సభ్యునిగా, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షునిగా రాజ్యాంగబద్ధమైన విధిని నేను నిర్వర్తించాను. కన్నూజ్లో రైతులకు మద్దతుగా నిరసన కార్య క్రమాలు చేపడతామని ముందుగానే తెలిపాం.అన్ని ఏర్పాట్లనూ చేశాం. అక్కడికి వెళ్లకుండా ప్రభుత్వం నన్ను అడ్డుకుంది. అదుపులోకి తీసుకుంది. నా నివాసం దగ్గర పోలీసులను మోహరించారు. నా వాహనాన్ని కూడా లాక్కున్నారు. ఇక్కడి ప్రభుత్వం చట్ట విరుద్ధంగా వ్యవహ రిస్తోంది. ఒక లోక్సభ సభ్యునికి ఉండాల్సిన హక్కులను కూడా కాలరాస్తోంది. దయచేసి మీరు జోక్యం చేసుకొని.. నా హక్కులను కాపాడండి’ అని కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos