జర్నలిస్టులను దూషించిన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా

జర్నలిస్టులను దూషించిన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా

లఖింపూర్ ఖేరి : మంత్రి అజయ్ మిశ్రా బుధవారం ఇక్కడ విలేఖరులపై విరుచుకు పడ్డారు. జైలులో ఉన్న తన కొడుకు అశిష్ మిశ్రాపై ప్రశ్నలు వేయగానే ఆయన సహనం కోల్పోయి ను దూషించారు. మైక్ లాక్కున్నారు. మీరంతా దొంగలు అంటు తిట్టారు. లఖింపూర్ ఖేరి లో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి వెళ్లిన కేంద్ర మంత్రిని విలేక రులు ప్రశ్నించినపుడు ఇలా స్పందించారు. జైలు పాలైన తన కొడుకు గురించి ప్రశ్నలు వేయగానే ఆయన సహనం కోల్పోయారు. ఒక్క ఉదుటున విలేకరులపైకి దూసు కు వెళ్లారు. మైక్ లాక్కున్నారు. మరొకరిని ఫోన్ తీయవద్దు.. జేబులో పెట్టుకోవాలని సీరియస్ అయ్యారు. ఆ విలేకరులను దూషించారు. ఏం కావాలి మీకు? ఏం సమాచా రం కావాలి? అంటూ ఆగ్రహించారు. సంబంధిత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos