కొత్త కూట‌మి ఏర్పాటు చేస్తాం.

కొత్త కూట‌మి ఏర్పాటు చేస్తాం.

చెన్నై : రానున్న లోక్సభ ఎన్నికల కోసం కొత్త కూటమి ఏర్పాటు చేస్తామని కాషాయ పార్టీతో మళ్లీ కలిసేది లేదని ఏఐఏడీఎంకే స్పష్టం చేసింది. బీజేపీతో సంబంధాలను తెగదెంపులు చేసుకుని ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చినట్టు ఏఐఏడీఎంకే ఇటీవల ప్రకటించింది. అయితే ఏఐఏడీఎంకే, బీజేపీ తోడుదొంగలని పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఈ పార్టీలు మళ్లీ కలుస్తాయని తమిళనాడు సీఎం స్టాలిన్, డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్లు పేర్కొన్న నేపధ్యంలో బీజేపీతో మున్ముందు కలిసేది లేదని ఏఐఏడీఎంకే తేల్చిచెప్పింది. బీజేపీ రాష్ట్ర శాఖ చీఫ్ కే అన్నామలైని ఆ పదవి నుంచి తొలగించాలని తమ పార్టీ కోరలేదని ఏఐఏడీఎంకే సీనియర్ నేత కేపీ మునుస్వామి తెలిపారు. కృష్ణగిరిలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏఐఏడీఎంకే మరో పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ను తొలగించాలని ఎన్నడూ కోరదని పేర్కొన్నారు. తమ పార్టీ అలాంటి పొరపాటు చేయబోదని అన్నారు. తాము తిరిగి ఎన్డీయే గూటికి చేరతామని, ఇదంతా డ్రామా అని స్టాలిన్ ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ప్రచారం చేస్తున్నారని ఇది వారిలో భయాన్ని వెల్లడిస్తోందని చెప్పారు. తాము ఎన్డీయేలో చేరేది లేదని, కే పళనిస్వామి నేతృత్వంలో నూతన కూటమి ఏర్పాటు చేస్తామని మునుస్వామి తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos