కేజ్రీవాల్ అరెస్టు ప్రతీకార రాజకీయాలకు పరాకాష్ఠ

కేజ్రీవాల్ అరెస్టు ప్రతీకార రాజకీయాలకు పరాకాష్ఠ

న్యూ ఢిల్లీ : సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం వెలుపల నిరసన చేస్తున్న ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్,అతిషి సహా పలువురు ఆప్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతిషిని పోలీసులు బస్సులోకి ఈడ్చుకెళ్లి సమీప పోలీస్ స్టేషన్కు తరలించారు. అరవింద్ కేజ్రీవాల్ను తన లాయర్ను, కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతించాలని, ఆయన తన అధికారిక పని చేయడానికి కూడా అనుమతించాలని సుప్రీంకోర్టును డిమాండ్ చేస్తామని సౌరభ్ భరద్వాజ్ చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్కు వ్యతిరేకంగా ఆప్ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్న క్రమంలో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఆప్ ఈరోజు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ స్పందించారు. మేము ఆమ్ ఆద్మీ పార్టీ, కేజ్రీవాల్కు అండగా ఉంటామని పేర్కొన్నారు. ప్రతీకార రాజకీయాల నేపథ్యంలోనే ప్రతిపక్షాలపై ఈడీ దాడులు చేస్తుందని ఆరోపించారు. తాము సొంతంగా గెలవలేమని బీజేపీకి తెలుసని, అందుకే ప్రతిపక్ష నేతలపై ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇది భారతదేశాన్ని నిరంకుశ దేశంగా మార్చే ఎత్తుగడకు నిదర్శమని అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos