రంగంలోకి దిగిన ఖర్గే.. 47 మందితో స్టీరింగ్ కమిటీ

న్యూ ఢిల్లీ: కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మల్లికార్జున్ ఖర్గే రంగంలోకి దిగారు. పాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) స్థానంలో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పార్టీ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వంటి ప్రముఖులకు చోటు దక్కింది. శశి థరూర్కు చోటు దక్కక లేదు. ఎక్కువగా సీడబ్ల్యూసీలో పని చేసిన నేతలకు ఇందులో స్థానం కల్పించారు. పార్టీ సర్వ సభ్య సమావేశం ఖర్గే ఎన్నికను ఆమోదించేంత వరకు, కొత్త సీడబ్ల్యూసీ ఏర్పడే వరకు ఖర్గే నేతృత్వంలోని మధ్యంతర ప్యానెల్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ స్థానంలో ఉంటుంది. అన్నిసీడబ్ల్యూసీ సభ్యులు, పదాధికార్లు బేరర్లు రాజీనామా చేసారు. స్టీరింగ్ కమిటీలో ప్రియాంక గాంధీ , ఏకే ఆంటోనీ, అంబికా సోనీ, ఆనంద్ శర్మ, కేసీ వేణుగోపాల్, రణదీప్ సూర్జేవాలా, దిగ్విజయ్ సింగ్ వంటి సీనియర్ పార్టీ నేతలు కూడా ఉన్నారు. వివేక్ బన్సాల్ మినహా.. మునుపటి సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత ఆహ్వానితులందరినీ కమిటీలో ఉంచారు. గతంలో సీడబ్ల్యూసీలో శాశ్వత ఆహ్వాని తుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బన్సాల్ ఇప్పుడు హర్యానా పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు.కొత్త కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా అజయ్ కుమార్ లల్లూ, చింతా మోహన్, దీపేందర్ సింగ్ హుడా, సచిన్ రావు, సేవాదళ్ ప్రధాన నిర్వాహకుడు లాల్జీ దేశాయ్, ఐవైసీ చీఫ్ శ్రీనివాస్, ఎన్ఎస్ యూఐ చీఫ్ నీరజ్ కుందన్, మహిళా కాంగ్రెస్ చీఫ్ నెట్టా.డి. సౌజా, ఐఎన్ టీయూసీ అధ్యక్షుడు జి సంజీవ రెడ్డిలు ఉన్నారు. కాగా.. గత కమిటీలో సభ్యుడు, పార్టీలో సంస్థాగత మార్పు కోసం ప్రయత్నిస్తున్న జీ 23 అసమ్మతి గ్రూపులో ప్రముఖ నాయకుడు ఆనంద్ శర్మను స్టీరింగ్ కమిటీలో చోటు కల్పించారు.కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్న వెంటనే కాంగ్రెస్ ఆఫీస్ బేరర్లు అందరూ రాజీనామా చేయడం ఆనవాయితీగా వస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos