ఆచార్య నుంచి కాజల్ కూడా నిష్క్రమణ

ఆచార్య నుంచి కాజల్ కూడా నిష్క్రమణ

హైదరాబాదు: చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తయారవుతున్న సినిమా ‘ఆచార్య’ నుంచి నటి కాజల్ కూడా వైదొలగారు. పాత్ర ప్రాధాన్యత లోపించటమే దీనికి కారణమని సినీ వర్గాలు తెలిపాయి. తొలుత కథానాయికగా త్రిష ను ఎంపిక చేసారు. తన పాత్రకి ప్రాధాన్యతలేదంటూ ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఆమె స్థానంలో కాజల్ ను తీసుకున్నారన్నారు. ఆ విషయాన్ని కాజల్ ధ్రువీకరించింది కూడా. తమిళంలో ఉదయనిధి స్టాలిన్ జోడీగా చేయడానికి ఆమె బల్క్ గా డేట్స్ ఇచ్చింది. భారీ పారితోషికమే అందుకుందని అంటున్నారు. తేదీలు సర్దుబాటు కానందునే ఆచార్య నుంచి తొలగినట్లు చెప్పిందట.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos