ఇప్పటికీ నా ఫేవరెట్‌ హీరో అతనే..

  • In Film
  • June 4, 2019
  • 126 Views
ఇప్పటికీ నా ఫేవరెట్‌ హీరో అతనే..

తెలుగు వెండితెరపై ఆకట్టుకున్న జోడీల్లో జూ.ఎన్టీఆర్‌,సమీరారెడ్డి జంట కూడా ఒకటి.కలసి నటించింది రెండు చిత్రాలే అయినా వెండితెరపై చూడచక్కని జంటగా కితాబులందుకున్నారు.అప్పుడప్పుడే అవకాశాలు దక్కుతున్న సమయంలో సమీరారెడ్డి అక్షయ్‌ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని అందరికీ షాక్‌ ఇచ్చారు.అప్పట్లో ఎన్టీఆర్‌,సమీరారెడ్డి గురించి రకరకాలు వార్తలు రావడంతో సమీరారెడ్డి కెరీర్‌ ఊపందుకుంటున్న సమయంలో పెళ్లి చేసుకున్నారని అప్పట్లో టాక్‌ వినిపిచింది.అనంతరం తెలుగులో జూ.ఎన్టీఆర్‌ టాప్‌ రేంజుకు వెళ్లిపోగా సమీరా ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు.ఇన్నేళ్ల అనంతరం ఇటీవల సమీరారెడ్డి హైదరాబాద్ లో ఓ ఈవెంట్ లో పాల్గొనేందుకు వచ్చార. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన సమీరా తెలుగులో ఏ హీరో సినిమాలు చూస్తున్నారు అని ప్రశ్నించగా.. ఇప్పటికీ నా ఫేవరెట్‌ హీరో ఎన్టీఆరేనని నేను నటించిన జూ. ఎన్టీఆర్ సినిమాలే ఎక్కువగా చూస్తుంటా అంటూ సమాధానం ఇచ్చారు.ఇన్నేళ్లయినా జూ.ఎన్టీఆర్‌పై అభిమానాన్ని ప్రదర్శించి ఎన్టీఆర్‌కు తనకు మధ్య స్నేహం ఎంతగట్టిదో సమీరా మరోసారి నిరూపించారు..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos