ఆఫ్రికన్ రకాల చేపల స్వాధీనం

హొసూరు : నిషిద్ధ ఆఫ్రికన్‌ రకాల చేపల పెంపకందార్లపై అధికారులు కొరడా ఝుళిపించారు. హొసూరు ప్రాంతంలో ఈ రకాల చేపల పెంపకం ఎక్కువగా సాగుతున్నది. వీటివల్ల రోగాలు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం ఈ చేపల పంపకాన్ని నిషేధించింది. అయినా కొందరు పట్టించుకోకుండా చేపల పెంపకం సాగిస్తుండడంతో అధికారులు పలుసార్లు హెచ్చరించారు. పెడచెవిన పెట్టడంతో ఆకస్మిక దాడులు నిర్వహించారు. అందులో భాగంగా

హొసూరు నుంచి బెంగళూరుకు లారీలో తరలిస్తున్న మూడు టన్నుల చేపలను అధికారులు స్వాధీనం చేసుకుని, ఓ గొయ్యిలో పాతిపెట్టారు. ఇకమీదట ఇలాంటి రకాల చేపలను పెంచే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ ప్రాంతంలోని పలు గ్రామాలకు చెందిన చేపల పెంపకందార్లు ఆఫ్రికన్ చేపలను పెంచుతున్నారని, వాటిని తొలగించి రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసే చేపలను పెంచుకోవాలని అధికారులు సూచించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos