ఆఫ్ఘన్ అధ్యక్షుడి ర్యాలీలో భారీ పేలుడు

ఆఫ్ఘన్ అధ్యక్షుడి ర్యాలీలో భారీ పేలుడు

కాబూల్‌ : ఆఫ్ఘనిస్థాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ ఎన్నికల ప్రచార సభలో సంభవించిన భారీ బాంబు పేలుడులో 24 మంది దుర్మరణం పాలయ్యారు. 31 మంది తీవ్రంగా గాయపడ్డారు. అధ్యక్షుడు ఘనీ త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. పర్వాన్‌ ప్రావిన్స్‌ రాజధాని చరికర్‌లో ఆయన ఓ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతుండగా పేలుడు సంభవించింది. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సభలోకి చొరబడిన ఆత్మాహుతి దళం సభ్యుడు ఈ అకృత్యానికి పాల్పడినట్లు ఓ ప్రభుత్వాధికారి తెలిపారు. ఈ నెల 28న ఆఫ్ఘనిస్థాన్‌లో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి.

 

తాజా సమాచారం