చైనాపై చేతలు ఎక్కడ?

చైనాపై చేతలు ఎక్కడ?

న్యూఢిల్లీ : ప్రభుత్వం ఎన్ని ప్రకటనలు చేస్తున్నా సరిహద్దుల్లో మాత్రం ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయని పార్లమెంట్లో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి గురువారం ఇక్కడ విమర్శించారు. ‘చైనా చొరబాట్లు అంతమయ్యేవి కావు. చైనా అత్యంత దూకుడు ప్రదర్శిస్తోంది. ఇలా జరుగు తుండటంతో సామాన్యుడిలో బాధ మరింత పెరిగిపోతోంది. చైనా చొరబాట్లను సమర్థవంతంగా తిప్పి కొట్టడంలో మన దేశ ఆర్మీ జవాన్లు అత్యంత సమర్థులు. దౌత్యపరమైన మార్గాల ద్వారా మాత్రమే చైనాతో తలెత్తిన విభేదాలను ప్రభుత్వం పరిష్కరించాలని చూస్తోంది. అది మంచి మార్గమే. అయితే పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతోంది. చైనా భారత్ను బెదిరించాలని చూస్తోంది. భయపడే తత్వం భారత్కు లేదు.వారికి ఏ భాషైతే అర్థమవుతుందో. ఆ భాషలోనే జవాబివ్వాలి.పార్లమెంట్ సమావేశాల కంటే ముందే ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించాలి. సరిద్దుల్లోని పరిస్థితులపై దేశానికి చెప్పాలి. దేశం మొత్తం ప్రధాని మోదీ వెంటే ఉంది. లడఖ్ నుంచి అరుణాచల్ వరకూ చైనా చొరడుతోంది. ఇది అత్యంత ఆందోళన కలిగించే విషయమ’ని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos