పాన్‌–ఆధార్‌ అనుసంధానం ఇలా

బెంగళూరు: పాన్ కార్డు, ఆధార్ కార్డులను కలిగిన వారు వచ్చే సోమవారం లోగా రెండింటినీ అనుసంధానం చేసుకుని తీరాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది. ఆదాయపు పన్ను పత్రాల దాఖలాకూ ఆధార్ నంబర్ అవసరం. పాన్కార్డు లేని వారు ఆధార్తో ఆదాయపు పన్ను పత్రాల్ని దాఖలు చేయవచ్చు. ఆన్లైన్ లేక ఎస్ఎంఎస్ ద్వారా రెండింటినీ అనుసంధానం చేయ వచ్చని ఆదాయపు పన్ను శాఖ అధికార్లు తెలిపారు.
లాగిన్ ఇలా
పన్ను చెల్లింపుదారులు ఇన్కం ట్యాక్స్ ఇ–ఫైలింగ్ వెబ్సైట్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలి. ఇది వరకే యూజర్ ఖాతా కలిగి ఉన్నవారు నేరుగా ఇ–ఫైలింగ్ పోర్టర్లో లాగిన్ కావచ్చు. లాగిన్ అయ్యేందుకు గతంలో క్రియేట్ చేసుకున్న యూజర్ ఐడీ, పాస్వర్డ్, కోడ్ నంబర్ను నమోదు చేయాలి. దీంతో ఆధార్, పాన్ సంఖ్యల లింక్ వివరాలు తెలుసుకోవచ్చు. www.incometaxindiaefiling.gov.in లో లాగిన్ అయి ప్రొఫైల్ సెట్టింగ్స్లోకి వెళ్లాలి. అక్కడ కనిపించే ముఖచిత్రంలో ఎడమ భాగంలో లింక్ ఆధార్ న్యూ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఒక విండో ఓపెన్ అవుతుంది. అక్కడ పాన్కార్డు సంఖ్య, ఆధార్కార్డు సంఖ్య, పేరు వివరాలను పూర్తి చేయాలి. ఆదాయపన్ను శాఖ ఈ వివరాలను సరిచూస్తుంది. క్రాస్ చెక్ పూర్తి అయిన తర్వాత మీ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. వ్యాలిడేషన్ పూర్తయిన తర్వాత పాన్కార్డుతో ఆధార్ అనుసంధానం జరుగుతుంది. వివరాలన్నీ సరిపోతేనే ఈ అనుసంధాన ప్రక్రియ సజావుగా జరుగుతుంది. అనుసంధానం పూర్తయితే మీకు సమాచారం అందుతుంది.

ఎస్ఎంఎస్ ద్వారా..
యూఐడీపీఏఎస్ అని ఆంగ్ల అక్షరాల్లో టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆధార్ నంబర్ ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చి పాన్ నంబర్ ఎంటర్ చేసి 567678కు ఎస్ఎంఎస్ పంపాలి. ఆధార్కార్డుతో లింక్ అయిన మొబైల్ నంబర్తోనే ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది.

అనుసంధానం ఎందుకు..
ఆదాయపన్ను శాఖ రిటర్న్స్ దాఖలు చేసినప్పుడు మీ మొబైల్కు వచ్చే ఓటీపీ మీ ఆధార్ అనుసంధానం అయిన సెల్ నంబర్కు ఇక నుంచి వస్తుంది. అలాగే ఆ శాఖ ఇ–వెరిఫికేషన్ మరింత సులువవుతుంది. పాన్తో పాటు ఆధార్ అనుసంధానం చేయని పక్షంలో సెప్టంబర్ 30 తర్వాత పాన్కార్డు నిరుపయోగంగా మారుతుంది. ఆదాయ పన్ను పత్రాల్ని దాఖలు చేసేవారు ఆధార్ను పాన్కు అనుసంధానించడం మంచిది. ఇన్కం ట్యాక్స్ వెబ్సైట్లో ఆధార్ అనుసంధానం జరిగి ఉంటే వీరు ఐటీఆర్–5ను ప్రింట్ తీసి పంపాల్సిన అవసరం ఉండదు. దీంతో పన్ను రిటర్నుల ప్రక్రియ త్వరితగతిన జరుగుతుంది.

తాజా సమాచారం