నెల్లూరు జిల్లాలో ఆక్వా సమస్యల సంగతేమిటి?

నెల్లూరు జిల్లాలో ఆక్వా సమస్యల సంగతేమిటి?

న్యూ ఢిల్లీ : మత్స్య పరిశ్రమ అనేక సమస్యలను ఎదుర్కొంటోందని, గిట్టుబాటు ధర లభించక ఆక్వా రైతులు ఇబ్బంది పడుతున్నారనే విషయం మీ దృష్టికి వచ్చిందా అని సభ్యుడు ఆదాల ప్రభాక ర్రెడ్డి లోక్ సభలో మంగళ వారం ప్రశ్నించారు. ఆక్వా రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన ప్రోత్సాహకాలను అంది స్తోందనీ అడిగారు. దీనికి కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాల రాత పూర్వకంగా బదులిచ్చారు. నెల్లూరు జిల్లాలో ఆక్వా, మత్స్య పరిశ్రమ సమస్యలు తమ దృష్టికి రాలేదని తెలిపారు. కేంద్రం ప్రధాని మత్స్య సంపద యోజన పథకం కింద 2020- 21,22 ఆర్థిక సంవత్సరాల్లో నెల్లూరు జిల్లాకు రూ.149. 23 కోట్లు కేటాయించామని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos