కష్టానికి ప్రతి ఫలం దక్కేది రేపు

కష్టానికి ప్రతి ఫలం దక్కేది రేపు

నెల్లూరు: ఈ ఎన్నికల్లో పడిన కష్టానికి రేపు ప్రతిఫలం లభించనుందని అందువల్ల పోలింగ్ ఏజెంట్లు చాలా జాగ్రత్త వహించాలని మాజీ మంత్రి ,నెల్లూరు లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి పిలుపు నిచ్చారు. బుధవారం ఇక్కడ జరిగిన పోలింగ్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. గత నలభై రోజులుగా చంద్రబాబు ఓటమి భయంతో తమ కార్యకర్తలకు రకరకాల శిక్షణ ఇస్తున్నారని పేర్కొన్నారు. దీని ఎదుర్కొనే విషయమై ఎటువంటి జాగ్రత్తలు తీసు కోవాలో,వారికి తగిన సూచనలు ఇచ్చేం దుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ప్రత్యర్థుల మోసాలను ఏ విధంగా నిలువరించాలనేది తమ ప్రయత్నం అన్నారు. రానున్న ఎన్నికల్లో వైకాపాకు 130 విధానసభ, 18 నుంచి 22 వరకు లోక్‌ సభ స్థానాలు లభిస్తాయని ఆశించారు. సర్వేలు కూడా ఇదే విషయాన్ని తెలిపాయన్నారు. తాము కూడా ఇదే విషయాన్ని ప్రజల ద్వారా తెలుసుకు న్నామని చెప్పారు. ప్రజలు మార్పు కోరుకుంటు న్నారని తెలిపారు. ఈ ఎన్నికల్లో బాగా కష్టపడ్డామని ,ఆ కష్టానికి ప్రతిఫలం రేపు లభించ నుందని తెలిపారు. అందువల్ల పోలింగ్ ఏజెంట్లు  ఓట్లు లెక్కించేటప్పుడు మెలుకువగా వ్యవహ రించాలని కోరారు. రేపు జాగ్రత్తగా ఉంటే రానున్న ఐదేళ్లలో మనం దానికి ఫలితాన్ని అనుభవించవచ్చని సూచించారు . పోలింగ్ ఏజెంట్లకు కౌంటింగ్ శిక్షకుడు సుధీర్  రెడ్డి  మెళకువలు, జాగ్రత్తలు చెప్పారు. ఎంతో మర్యాదగా వ్యవహరించాలని, అధికారులతో చక్కగా మెలగాలని సూచించారు. ఏమైనా అను మానాలుంటే నివృత్తి చేసు కోవాలని కోరారు. పోలింగ్ ఏజెంట్ బాధ్యత చాలా కీల కమైనదని దాని నిజాయితీతో నిబద్ధతతో నిర్వర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విజయ డెయిరీ చైర్మన్ రంగారెడ్డి కార్పొరేటర్లు నూనె మల్లికార్జున యాదవ్ స్వర్ణ  వెంకయ్య,కోటేశ్వర్ రెడ్డి జీ వి ప్రసాద్, ఆర్ ఎస్ ఆర్, సుబ్బారెడ్డి, నరసింహారావు, మధు ,అబూబకర్, ఉమా మహేశ్వర్ రెడ్డి సుధాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos