గంజాయిని చట్టబద్ధం చేయాలట..

గంజాయిని చట్టబద్ధం చేయాలట..

డ్రగ్స్ కేసులో హీరోయిన్ రాగిణి ద్వివేది అరెస్ట్ పై స్పదించిన ప్రముఖ కన్నడ నటి నివేదిత సంచలన వ్యాఖ్యలు చేసింది. గంజాయి కూడా తులసి మొక్కలాంటిదే అని.. మన దేశంలో దాని వినియోగాన్ని చట్టబద్ధం చేయాలని కోరింది. గంజాయిని బ్యాన్ చేయడానికి ముందు అది ఆయుర్వేదానికి వెన్నెముకలా ఉండేదని పేర్కొంది. మనదేశంలో నిషేధించిన మత్తు పదార్ధాల్లో ఒకటైన గంజాయిని పవిత్రంగా పూజించే తులసి తో పోల్చడమే కాకుండా దాని వినియోగాన్ని చట్టబద్ధం చేయాలని నివేదిత కోరడంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. పాము విషయంతో మందులు తయారు చేస్తామని.. పాముతో కాటు వేయించుకోము కదా అని కామెంట్స్ చేస్తున్నారు. కొంపదీసి గంజాయి తులసి లాంటిదని నువ్వు కూడా తీసుకుంటున్నావా అని ట్రోల్ చేస్తున్నారు. ‘తులసి వనంలో గంజాయి మొక్క’ అనేదాన్ని మార్చేసి ఆ గంజాయి మొక్కను కూడా మంచిదే అని చెప్తూ మత్తు పదార్థాలకు సపోర్ట్ చేస్తోందని విమర్శిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos