మోదీ నటనకు అవార్డు ఇవ్వాలి

మోదీ నటనకు అవార్డు ఇవ్వాలి

న్యూఢిల్లీ : ‘నేనప్పుడు చాలా పేదవాడిని. తే నీరుమ్మాను. నాకస్సలు స్వార్థం లేదు. 18 ఏళ్లలో నేనిలా మాట్లాడం మొదటి సారి. నేను చాలా కష్టపడతాను’ అంటూ ప్రధాని మోదీ సోమ వారం రాత్రి ‘డిస్కవరి’ ఛానల్ ప్రసారం చేసిన ‘మేన్ వర్సెస్ వైల్డ్’ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమం విశిష్టంగా స్పందించింది. ‘నేనప్పుడు చాలా పేద వాడిని. తే నీరు అమ్మాను’ అని ఆ కార్యక్రమంలో సాహసికుడు బియర్ గ్రిల్స్తో మోదీ చెప్పడం మొదటిసారి. ఇది మాకు అరిగిపోయిన రికార్డు. మన్ కీ బాత్లో చాలాసార్లు విన్నాం’ అంటూ కొందరు ట్వీట్ చేసారు. ‘ఒక్క ముక్క కూడా హిందీ రాని బియర్ గ్రిల్స్, మోదీ మాటలను ఎలా అర్థం చేసుకున్నారబ్బా’ అని ఎక్కువ మంది ఆశ్చర్య పడ్డారు. హిందీ తప్పని సరైన సీబీఎస్ఈ లో బియర్ గ్రిల్స్ తప్పక పదో తరగతి ఉత్తీర్ణులై ఉంటాడని కొందరు ఎగతాళి చేసారు. మోదీ హిందీ మాటలను ఓపిగ్గా ఆలకించిన బియర్ గ్రిల్స్ పరిస్థితి ఇలా ఉందంటూ ఓ సినిమా క్లిప్ మరొకరు పోస్ట్ చేశారు. మాంచి కమెడియన్గా నటించినందుకు మోదీకి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు ఇవ్వాలని మరొకరు సలహా ఇచ్చారు. మోదీ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు చూసినందున టీఆర్పీ రేటు అనూహ్యంగా పెరిగి డిస్కవరీ ఛానల్ అధిపతికి అంతులేని డబ్బు వచ్చి ఉంటుందని కొందరు వ్యాఖ్యానించారు. దేశంలోని చాలా గ్రామాల్లో పాఠశాలల్లో, పంచాయతీ కార్యాలయాల్లో భాజపా నాయకులు టీవీలు పెట్టి మరీ మోదీ కార్యక్రమాన్ని ప్రజలకు చూపించారు. ఇది ‘మేన్ వర్సెస్ వైల్డ్’ కాదని, మన్ కీ బాత్ అంటూ ఒకరిద్దరు వ్యాఖ్యానించగా ‘మోర్ మేన్ లెస్ వైల్డ్’… ‘మేన్ వర్సెస్ మేన్’ అని ఎక్కువ మంది స్పందించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos