ఈడీ దాడుల్లో రూపాయి దొరకలేదు

ఈడీ దాడుల్లో రూపాయి దొరకలేదు

న్యూ ఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన బడా నేతల ఇండ్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసింది. పది ప్రదేశాల్లో ఈడీ దాడులు చేపట్టింది. దాంతో పాటు ఢిల్లీ జల్ బోర్డు అవినీతి కేసులో ఈడీ దాడులు జరిపింది. ఈడీ దాడులపై ఢిల్లీ మంత్రి, ఆప్ నేత అతిషి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్ నేతలను కట్టడి చేసేందుకే దాడులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. దాడుల్లో ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా దొరకలేదన్నారు. ఆప్ నేతలు, ఆప్తో అనుబంధం ఉన్న వ్యక్తులపై ఈడీ దాడులు జరుగుతున్నాయన్నారు.ఆప్ కోశాధికారి, రాజ్యసభ సభ్యుడు ఎన్డీ గుప్తా, అరవింద్ కేజ్రీవాల్ పీఏ తదితరుల ఇళ్లపై దాడులు జరిగినట్లు పేర్కొన్నారు. కేంద్ర సంస్థల ద్వారా తమ గొంతును అణచివేయాలని బీజేపీ యత్నిస్తోందన్నారు. గత రెండేళ్లుగా మద్యం కుంభకోణం కేసు పేరుతో ఆప్ నేతలను బెదిరింపులకు గురి చేస్తున్నారని అతిషి అన్నారు. కొందరి ఇండ్లపై దాడులు చేస్తున్నారని.. మరికొందరికి సమన్లు జారీ చేస్తున్నారన్నారు. మరికొందరిని అరెస్టు చేశారన్నారు. గత రెండేళ్లలో వేల సంఖ్యలో దాడులు జరిగాయని తెలిపారు. అయితే, ఇప్పటి వరకు ఈడీ టీమ్ ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేదన్నారు. వచ్చే రెండేళ్లలో కూడా ఈడీకి ఏమి దొరకబోవన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos