లైవ్‌ రిపోర్టింగ్‌లో మహిళ విలేకరి నడుంపై కొట్టాడు..

లైవ్‌ రిపోర్టింగ్‌లో మహిళ విలేకరి నడుంపై కొట్టాడు..

లైవ్‌ రిపోర్టింగ్‌ చేసే సమయంలో విలేకరులకు ఎదరుయ్యే కొన్ని అనుభవాలు,ఘటనలు చిత్రవిచిత్రంగా ఉంటాయి.అందులోనూ మహిళ విలేకరులకైతే ఇటువంటివి ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి.తాజాగా అటువంటి అనుభవమే ఓ ఆంగ్ల మాధ్యమ మహిళ విలేకరికి ఎదురైంది. జార్జియాలోని సవ్హానా ప్రాంతంలో ఓ బ్రిడ్జి వద్ద జరుగుతోన్నరన్ ర్యాలీ గురించి . వీఎస్ఏవీ టీవీ జర్నలిస్టు అలెక్స్ బోజర్జియాన్ లైవ్‌ కవరేజ్‌ చేస్తోంది. రన్‌ర్యాలీలో పాల్గొన్న పలువురు టీవీలో కనపడాలన్న ఉత్సాహంతో మహిళా జర్నలిస్టు వెనుక నుంచి హాయ్ చెబుతూ వెళ్లారు.అందులో ఓ వ్యక్తి మాత్రం మహిళా జర్నలిస్టు నడుముపై కొట్టి వెళ్లిపోయాడు. పరిణామంతో ఆమె షాక్ అయింది. అయినప్పటికీ తన లైవ్ కవరేజ్  కొనసాగించింది. ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వీడియో ట్విట్టర్ లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు దీన్ని 11 మిలియన్ల మంది చూశారు.కాగా ఈ చర్యకు పాల్పిన వ్యక్తి పేరు థామస్ కల్లావె(43) గా పోలీసులు గుర్తించారు. అతడిపై లైంగిక వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటువంటి చర్యలకు తాము ఉపేక్షించబోమని పోలీసులు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos