ప్రభాస్ రాకుంటే కిందకు దూకేస్తా..

ప్రభాస్ రాకుంటే కిందకు దూకేస్తా..

హీరో ప్రభాస్ జనగామకు రావాలని లేదంటే కిందకు దూకేస్తానంటూ ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి హంగామా చేస్తుండడంతో పోలీసులు వ్యక్తిని కిందకు దించడానికి తంటాలు పడుతున్నారు.మహబూబాబాద్ కు చెందిన గుగులోతు వెంకన్న అనే వ్యక్తి జనగామ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై ఉడుముల హాస్పిటల్ సమీపంలో ఉన్న సెల్ టవర్ ఎక్కి నానా హంగామా సృష్టిస్తున్నాడు. సినీ హీరో ప్రభాస్ వెంటనే జనగామ కి రావాలని , లేకుంటే అక్కడి నుంచి దూకి చనిపోతానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు.ఇక తాజాగా సాహో సినిమా ఫ్లాప్ కావడంతో ఆవేదనతో సెల్ టవర్ ఎక్కి ఉంటాడని కొందరు చర్చించుకుంటే, మరి కొందరు అతనికి మతిస్థిమితం సరిగా లేదేమో అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎవరెంత చెప్పినా తన సెల్ టవర్ దిగేది లేదని తేల్చి చెబుతుండడంతో స్థానికులు, పోలీసులు వెంకన్నను కిందకు దించేందుకు ప్రయత్నం చేస్తున్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos