మందుబాబులను హడలెత్తించిన జూనియర్ ఆర్టిస్టులు..

మందుబాబులను హడలెత్తించిన జూనియర్ ఆర్టిస్టులు..

సినిమాల్లో నటించే జూనియర్‌ ఆర్టిస్టులను పోలీసులుగా భావించి మందుబాబులు వాహనాలు వదిలి పరుగు లంకించుకున్న ఉదంతం హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.వారాంతం కావడంతో కాస్త చుక్కేసి ఇంటికి వెళదామని మందుబాబులు బార్‌లలో పెగ్గు మీద పెగ్గు కొట్టి బైకులపై హుషారుగా ఇళ్లకు బయలుదేరారు. వారాంతాల్లో పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చేస్తుంటారని తెలిసినా మనసు ఆగలేక చుక్కేసిన మందుబాబులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చేస్తున్నారమోనని చాలా జాగ్రత్తగా గమనిస్తూ వెళ్లసాగారు.ఈ క్రమంలో షేక్ పేట్ నాలా వద్ద తెల్లరంగు షర్ట్, ఖాకీ ప్యాంటు ధరించి, పెద్ద ఎత్తున వాహనాలను మోహరింపజేసిన పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ ను చేపట్టారు.అటు లింగంపల్లి నుంచి మెహదీపట్నం వైపు వచ్చే వాహనాలను నిలిపివేశారు. రోడ్డుకు అడ్డంగా బ్యారికేడ్లను పెట్టి మరీ..బ్రీత్ ఎనలైజర్లను పట్టుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుండటాన్ని చూసి మందుబాబులకు ఠారెత్తిపోయింది.అంతే మందు ఇచ్చిన హుషారు,నషా మొత్తం ప్యాంటులోకి దిగిపోవడంతో బైకులు రోడ్డు పక్కన నిలిపివేసి పరుగు లంకించుకున్నారు.అలా కొంతదూరం వెళ్లి వెనక్కి తిరిగి చూసిన మందుబాబులు పోలీసులు మధ్య మధ్యలో చేతులు కట్టుకుని సివిల్ డ్రెస్ లో ఉన్న వారితో మాట్లాడటాన్ని చూసిన మందుబాబుల్లో అనుమానం కలిగింది.దీంతో దగ్గరికి వచ్చి పరిశీలించి చూడగా.. సినిమా షూటింగ్ కోసం ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ కోసం నిర్వహించిన ఉత్తుత్తి డ్రంక్ అండ్ డ్రైవ్ గా తేలింది.అసలు విషయం తెలియడంతో తమ అమాయకత్వానికి తామే నవ్వుకుంటూ వెళ్లిపోయారు..

 

తాజా సమాచారం