దురహంకారం పీచమణిగింది

దురహంకారం పీచమణిగింది

కోల్కతా : వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేయదలచినట్లు ప్రధాని చేసిన ప్రకటనకు ‘‘దురహంకారం నష్టపోయింది. విర్రవీగడం నుంచి మోకరిల్లడం వరకు’’ అని టీఎం సీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఒబ్రెయిన్ ట్విటర్ లో దుయ్యబట్టారు. గత 2020 సెప్టెంబరులో పోస్ట్ చేసిన వీడియోను రీట్వీట్ చేశారు. చర్చించకుండా ఈ సాగు చ ట్టాలను తీసుకొచ్చారని అందులో విమర్శించారు. పార్లమెంటులో జరుగుతున్నదానిని దేశ ప్రజలు చూడకూడదనే ఉద్దేశంతో రాజ్యసభ టీవీ ఫీడ్ను కట్ చేశారని ఆరోపించారు. ఇది చాలా దారుణమని పేర్కొన్నారు. రాజ్యసభ టీవీని సెన్సార్ చేశారని, ప్రచారం జరగకుండా చూసుకున్నారని అన్నారు. తమ వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయ న్నారు.

తాజా సమాచారం