హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి శనివారం రాజీనామా చేశారు. గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళ్ళులర్పించిన అనంతరం రాజీనామా లేఖను శాసనసభ కార్యదర్శికి అందించారు. నేటి సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. 14న భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లేందుకు ఈటల వర్గం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఈటలతో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి, రమేష్ రాథోడ్, తుల ఉమ, మరికొందరు నేతలూ బీజేపీలో చేరనున్నారు.