సామాజిక దూరం కాదు.. భౌతిక దూరం

సామాజిక దూరం కాదు.. భౌతిక దూరం

అమరావతి: ‘కరోనా వ్యాపించకుండా నివారణకు వాడుతున్న సామాజిక దూరం అనే పదానికి బదులుగా భౌతిక దూరమనే పదాన్ని వాడాల్సిందిగా సూచించాలని ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డికి కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి రామకృష్ణ విన్నవించారు. ‘సామాజిక దూరం అనే పదాన్ని చాందస వాదులు కులాన్ని అవమా నించడానికి వాడిన పదం. ఆ పదానికి బదులుగా భౌతిక దూరం అనే పదాన్ని ఉపయోగించాలని అన్ని ప్రభుత్వ శాఖలను ఆదేశించాలి. ఇకపై ముద్రణ, ఎలక్ట్రానిక్ మాధ్యమాలలో ఇచ్చే ప్రభుత్వ ప్రకటనలలో భౌతిక దూరం అనే పదాన్ని ఉపయోగించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.

తాజా సమాచారం