నిండు చూలాలికి నరకం చూపిన లాక్డౌన్

నిండు చూలాలికి నరకం చూపిన లాక్డౌన్

మీరట్: లాక్డౌన్ దయనీయ గాథలు సభ్య సమాజాన్ని కంటతడి పెట్టిస్తున్నాయి. ధనవంతుల అమానుషాన్ని వెలుగు చూపు తున్నాయి. సహరాన్పూర్లో కూలి జీవిక సాగిస్తున్న బులంద్షహర్ జిల్లా అమర్గఢ్కు చెందిన యస్మీన్, వకిల్ ఉన్నట్టుండి యజమాని పనిలో నుంచి తీసేయడంతో.. ఎనిమిది నెలల నిండు గర్భిణి యాస్మిన్,భర్త వకీల్కుర్త దిక్కుతోచ లేదు. తమకు రావాల్సిన జీతం కూడా ఇవ్వకుండా మొండి చేయి చూపాడు. దంపతులిద్దరూ కాలినడకన స్వగ్రామానికి బయల్దేరారు. దాదాపు 100 కి.మీలు నడిచి మీరట్ చేరుకున్నారు. అక్కడ యాస్మిన్ తీవ్రంగా నీరసించిపోయింది. నడిచేపరిస్థితి లేకపోవడంతో వకిల్ ఆమెను సోహ్రాబ్ బస్టాండ్ వద్దకు తీసు వెళ్లాడు. వీరిని గమనించిన స్థానికులు నవీన్ కుమార్, రవీంద్ర వెంటనే నౌచండి పోలీసులకు తెలిపారు. ఇంకా ఆహారం,కొంత నగదు సమకూర్చారు. పోలీసులు అంబులెన్స్ ద్వారా వారిని గ్రామానికి తరలించారు.

తాజా సమాచారం