హీరోయిన్లకు స్ఫూర్తిగా నిలిచిన ప్రణీత..

  • In Film
  • March 28, 2020
  • 131 Views
హీరోయిన్లకు స్ఫూర్తిగా నిలిచిన ప్రణీత..

దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా నిర్మూలనకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక విరాళం ప్రకటించడంతో పాటు కరోనా ప్రభావంతో ఉపాధి కోల్పోయిన కార్మికులకు ఆర్థిక సహాయం ప్రకటించి అన్ని చిత్రపరిశ్రమల హీరోలు,నటులు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.అయితే హీరోయిన్లలో ఏ ఒక్కరూ ఇంతవరకు ఒక్క రూపాయి విరాళంగా ప్రకటించినట్లు వార్తలు రాలేదు.ఈ తరుణంలో బహుభాష హీరోయిన్‌ ప్రణీత తన వంతు సహాయంగా రూ. లక్ష విరాళాన్ని ప్రకటించి అందరికీ ఆదర్శంగా నిలిచింది. సందర్భంగా ప్రణీత మాట్లాడుతూ, కష్ట కాలంలో ఒక్కో కుటుంబానికి కనీసం రూ. 2 వేలు అవసరమనితమ ప్రణీత ఫౌండేషన్ ద్వారా లక్ష రూపాయలతో 50 కుటుంబాలకు సాయం చేస్తామని చెప్పింది. తాను చేస్తున్న సాయం చాలా చిన్నదే అని తెలిపింది. ఎఫర్ట్స్ ఫర్ గుడ్, లాజికల్ ఇండియన్ సంస్థలతో కలిసి హెల్ప్ హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో ప్రణీత ఫౌండేషన్ 500 కుటుంబాలకు సాయం చేసేందుకు సన్నాహకాలు చేస్తోందని చెప్పింది.మిగిలిన హీరోయిన్లు ఇప్పటికైనా కళ్లు తెరచి ప్రణీతను ఆదర్శంగా తీసుకొని విరాళాలు ప్రకటిస్తారేమో చూడాలి..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos