రానా-రవితేజలతో విక్రమ్‌ వేదా రీమేక్‌!

  • In Film
  • February 11, 2020
  • 184 Views
రానా-రవితేజలతో విక్రమ్‌ వేదా రీమేక్‌!

మాధవన్‌-విజయ్‌ సేతుపతి కాంబినేషన్‌లో 2017లో విడుదలైన విక్రమ్‌ వేదా చిత్రం తమిళంలో అద్భుత విజయం సాధించింది.మాధవన్‌-విజయ్‌ సేతుపతి ఒకరితో ఒకరు పోటీ పడి నటించిన ఈ చిత్రం ఆ ఏడాది బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది.అప్పట్లో ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేయడానికి ప్రయత్నాలు కూడా జరిగాయని వెంకటేశ్‌-రానా కాంబినేషన్‌లో తెరకెక్కుతుందని వార్తలు వినిపించినా అవేవి నిజం కాలేదు.మరోసారి ఈ సినిమాను తెలుగులో గీతా ఆర్ట్స్ వారు రీమేక్ చేయాలనుకున్నారు. ప్రధాన పాత్రలకి గాను రానారవితేజ పేర్లు వినిపించాయి.అయితే కొన్ని కారణాల వలన ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. మళ్లీ ఇప్పుడు అల్లు అరవింద్ ప్రాజెక్టు గురించిన ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. తమిళంలో మాధవన్ చేసిన పాత్రను చరణ్ తో చేయిస్తే బాగుంటుందని ఆయన భావిస్తున్నట్టు చెబుతున్నారు. మరో పాత్రను రవితేజతో చేయిస్తారా? రానాను తీసుకుంటారా? అనే విషయంలో స్పష్టత రావలసి వుంది. 2022లో ప్రాజెక్టు పట్టాలపైకి వెళుతుందని చెప్పుకుంటున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos