స్నేహ బంధమే…ఇంకే బంధమూ లేదు

  • In Film
  • August 16, 2019
  • 146 Views
స్నేహ బంధమే…ఇంకే బంధమూ లేదు

హైదరాబాద్‌ : బాహుబలి రెండు భాగాలు సూపర్‌ హిట్‌ కావడంతో ఆ చిత్రాల్లోని ప్రధాన జంట ప్రభాస్‌, అనుష్కలు ప్రేమలో పడ్డారని బాలీవుడ్‌లో తెగ ప్రచారం జరుగుతోంది. త్వరలో వీరు పెళ్లి చేసుకోనున్నారని, ఇల్లు కూడా కొనుగోలు చేయనున్నారని వార్తలు వచ్చాయి. దీనిపై ప్రభాస్‌ స్పందిస్తూ, అనుష్క తనకు మంచి స్నేహితురాలు మాత్రమేనని తెలిపారు. ఇంతకు మించి తమ మధ్య వేరే బంధం లేదని తేల్చి చెప్పారు. తామిద్దరినీ ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరైనా చూశారా అని ఎదురు ప్రశ్నించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos