వైభవంగా ఆర్తి చాబ్రియా వివాహం

  • In Film
  • June 25, 2019
  • 149 Views
వైభవంగా ఆర్తి చాబ్రియా వివాహం

ముంబై : సినీ నటి ఆర్తి చాబ్రియా వివాహం ఇక్కడ ఘనంగా జరిగింది. ఛార్టెర్డ్‌ అకౌంటెంట్‌ విశరధ్‌ బీడసీనును ఆమె వివాహమాడారు. పలువురు నటీ నటులు ఈ వివాహోత్సవానికి హాజరయ్యారు. వివాహం ఫొటోలు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున దర్శనమిస్తున్నాయి. విశరధ్‌ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పని చేస్తున్నారు. త్వరలో ముంబైకి మకాం మార్చనున్నారు. ఆర్తి 2003లో ఒకరికి ఒకరు తెలుగు సినిమాతో మన ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అనంతరం ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి, గోపి గోడ మీద పిల్లి చిత్రాల్లో కూడా నటించారు. వెంకటేశ్‌ నటించిన చింతకాయల రవి చిత్రంలో ఓ ప్రత్యేక గీతంలో కనిపించారు. ఆమె కెరీర్‌ బాలీవుడ్‌లో ప్రారంభమైంది. 2013లో చివరగా ఓ పంజాబీ సినిమాలో నటించారు. తర్వాత నటనకు స్వస్తి పలికారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos