ఏడు కాదు… తొమ్మిది గంటలు, జ‌గ‌న్ కు బాబు మ‌రో షాక్‌

ఏడు కాదు… తొమ్మిది గంటలు, జ‌గ‌న్ కు బాబు మ‌రో షాక్‌

మొన్న పెన్ష‌న్ రెండు వేల‌కు పెంపు. నేడు రైతుల‌కు తొమ్మ‌ది గంట‌ల విద్యుత్‌. జ‌గ‌న్ త‌న‌కు మైలేజ్ తెస్తాయ‌నుకోని ప్ర‌క టించిన హామీల‌ను య‌ధాత‌ధంగా ముఖ్య‌మంత్రి అమ‌లు చేసేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు ఓట్లు తెచ్చి పెడ‌తాయ ని భావించిన వైసిపి నేత‌లకు ఇప్పుడు ఇది కొత్త ఛాలెంజ్‌. హామీ ఇచ్చిన వారినా..అమ‌లు చేస్తున్న వారినా ప్ర‌జ‌లు ఎవ‌రిని న‌మ్ముతారు..ఎవ‌రికి ప‌ట్టం క‌డ‌తారు..
జ‌గ‌న హామీల అమలు వ్యూహాత్మకమేనా..
ఎలాగైనా అధికారంలోకి రావాల‌నే ల‌క్ష్యంతో వైసిపి అధినేత జ‌గ‌న్ న‌వ‌ర‌త్నాల‌కు ప‌దును పెట్టారు. ఎన్నిక‌ల‌కు చాలా ముందుగానే త‌న ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌ను ప్ర‌క‌టించారు. అందులో భాగంగా.. సామాజిక పెన్ష‌న్లు పెంపు రెండు వేల‌కు పెంచుతామ‌ని వెల్ల‌డించారు. జ‌గ‌న్ హామీల విమ‌ర్శ‌లు చేస్తూనే..ముందు స‌రిగ్గా గురి చూసి వైసిపి ని ఆత్మ ర‌క్ష‌ణ‌లోని నెట్టేసే వ్యూహం ముఖ్య‌మంత్రి అమ‌లు చేస్తున్నార‌ని టిడిపి సీనియ‌ర్లు విశ్లేషిస్తున్నారు. ముందుగా పెన్ష‌న్ ను వెయ్యి నుండి రెండు వేల‌కు పెంచుతూ నిర్ణ‌యం ప్ర‌క‌టించారు. ఇది జ‌గ‌న్ త‌న న‌వ‌ర‌త్నాల్లో ప్ర‌క‌టించిన అంశ‌మే . ఈ నెల నుండే పెరిగిన పెన్ష‌న్లు అందిస్తూ..ఓట‌ర్ల‌కు ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దీని ద్వారా దాదాపు 60 ల‌క్ష‌ల మంది ఓట‌ర్ల పై ప్ర‌త్య‌క్ష ప్ర‌భావం చూపుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అయితే, ముఖ్య‌మంత్రి వ్యూహాత్మ‌కంగానే ఈ నిర్ణ‌యాలు తీసుకొని..వైసిపికి ప్ర‌చారం చేసుకొనే అవ‌కాశం లేకుండా చేస్తున్నార‌ని టిడిపి నేత‌లు సంబ‌ర ప‌డుతున్నా రు. దీని కార‌ణంగా..త‌మ పై ఉన్న వ్య‌తిరేక‌త త‌గ్గి..ఓట్లుగా మారుతుంద‌న్న‌ది వారి అంచ‌నా.
విద్యుత్ హామీ అమ‌లు..వాట్ నెక్ట్స్‌..
జ‌గ‌న్ త‌న న‌వ‌రత్నాల్లో తొమ్మ‌ది గంట‌ల విద్యుత్ అందిస్తాన‌ని హామీ ఇచ్చారు. ఇప్పుడు రైతుల‌ను ఆక‌ట్టుకొనేందుకు ముఖ్య‌మంత్రి విద్యుత్ పైనా నిర్ణ‌యం అమ‌లుకు శ్రీకారం చుట్టారు. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్‌ను తొమ్మిది గంటలు ఉచితంగా ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం వెంటనే విధివిధానాలు రూపొందించాలని, ఆ వెంటనే అమల్లోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంధన సంస్థలను ఆదేశించారు. అయితే, జ‌గ‌న్ త‌న హామీలో 9 గంట ల ఉచిత విద్యుత్ ప‌గ‌లు పూట ఇచ్చేలా ప్ర‌క‌టించారు. అయితే, చంద్ర‌బాబు మాత్రం ప‌గ‌టి పూట అని చెప్ప‌టం లేదు. తొమ్మిది గంటల ఉచిత విద్యుత్‌ వల్ల 17లక్షల మంది రైతులు లబ్ధి పొందుతారని..ఇందుకోసం దాదాపుగా రూ. 1200 కోట్లు అదనపు నిధులు అవసరమని చెబుతున్నారు. ఉచిత విద్యుత్‌, కొత్త కనెక్షన్లకు రాయితీ కింద రూ.6030కోట్లు ఖర్చు అవుతోందని, తాజా నిర్ణయంతో అది రూ.7230కోట్లకు చేరుతుందని అధికారులు స్ప‌ష్టం చేసారు.

జ‌గ‌న్ హామీలు..బాబు ఆచ‌ర‌ణ‌..ఇప్పుడెలా..!
తాను ఇస్తున్న హామీల‌ను అధికారంలో ఉన్న చంద్ర‌బాబు అమ‌లు చేసే అవ‌కాశం ఉంద‌ని జ‌గ‌న్ ముందుగానే అంచ నా వేసారు. దీంతో..ముందుగానే దీనికి త‌గిన‌ట్లుగా ప్ర‌క‌ట‌న చేసారు. త‌న హామీల‌ను చంద్ర‌బాబు అమ‌లు చేస్తే ఆ క్రెడి ట్ త‌న‌కే ద‌క్కుతుంద‌ని జ‌గ‌న్ విశ్లేషించారు. ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు అమ‌లు చేయ‌కుండా..తాను ప్ర‌క‌టించిన త‌రు వాత మాత్ర‌మే వాటిని అమ‌లు చేస్తే ప్ర‌జ‌లు విశ్వాసంలోకి తీసుకోర‌న్న‌ది జ‌గ‌న్ వాద‌న‌. చంద్ర‌బాబు నిర్ణ‌యాల ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించి చెబుతామ‌ని..జ‌గ‌న్ కార‌ణంగానే చంద్ర‌బాబు ఆ నిర్ణ‌యాలు అమ‌లు చేస్తున్నార‌ని..దీంతో, జ‌గ‌న్ వ‌ల‌నే ల‌బ్దిదారుల‌కు మేలు జ‌రుగుతుంద‌నే విష‌యాన్ని ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని భావిస్తున్నారు. అయితే, టిడిపి నేత లు మాత్రం నిర్ణ‌యాలు అమ‌లు చేసిన వారినే ప్ర‌జ‌లు ఆద‌రిస్తార‌ని.. చంద్ర‌బాబు ఎవ‌రినో కాపీ కొట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని..ఇది ఎన్నిక‌ల వ్యూహంలో భాగ‌మేన‌ని టిడిపి నేత‌లు విశ్లేషిస్తున్నారు. దీంతో..క్షేత్ర స్థాయిలో ప్ర‌జ‌లు ఎవ‌రి కి ఈ క్రెడిట్ ఇస్తార‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos