జైళ్లో సొరంగం తవ్వి 75 మంది ఖైదీలు పరార్‌..

జైళ్లో సొరంగం తవ్వి 75 మంది ఖైదీలు పరార్‌..

పరాగ్వే దేశంలోని పెడ్రొ జాన్ కబల్లెరో నగరంలోని ఒక జైలు నుంచి 75 మంది ఖైదీలు తప్పించుకోవడం చర్చనీయాంశం అయ్యింది. తప్పించుకుని పారిపోయిన ఖైదీల్లో చాలామంది బ్రెజిల్దేశంలోని అతిపెద్ద ఆర్గనైజ్డ్ క్రిమినల్ గ్యాంగ్ అయిన ఫస్ట్ కమాండ్ ఆఫ్ ది క్యాపిటల్ (పీపీసీ)కి చెందినవారు. బ్రెజిల్లోని సావో పాలో నగరం కేంద్రంగా పనిచేసే క్రిమినల్ గ్యాంగ్లో దాదాపు 30 వేల మంది సభ్యులు ఉన్నారు. వీరంతా మత్తు పదార్థాలను, ఆయుధాలను అక్రమంగా రవాణా చేస్తుంటారు. బ్రెజిల్తో పాటుగా చుట్టుపక్కలే ఉన్న పరాగ్వే, బొలీవియా, కొలంబియాల్లో కూడా ముఠా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. జైలు ప్రధాన ద్వారం నుంచే ఖైదీలంతా నడుచుకుంటూ బయటకెళ్లారని, వీరు తప్పించుకోవడానికి జైలు గార్డులు సహాయం చేసి ఉంటారని జైలు అధికారులు అనుమానిస్తున్నారు. సొరంగం నుంచి బయటకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న ఒక ఖైదీని అధికారులు పట్టుకొని విచారణ చేయడంతో విషయం వెలుగు చూసింది. వ్యవహారంలో జైలు అధికారుల పాత్ర ఉందని స్పష్టంగా తెలుస్తోందని దేశ న్యాయ శాఖ మంత్రి సెసిలియా పెరేజ్‌ చెప్పారు.”మేం టన్నెల్‌ని కనుగొన్నాం. కానీ, ఖైదీలను తప్పించడానికి లేదంటే దీన్నంతా కప్పిపుచ్చడానికి టన్నెల్ తవ్వారని భావిస్తున్నాం. జైలు సిబ్బంది సహకారం ఉంది” అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.గత కొద్ది రోజులుగా చిన్నచిన్న గ్రూపులుగా ఖైదీలను జైలు నుంచి తప్పించారని ఇంటెలిజెన్స్ సమాచారం తమకు ఉందని  వెల్లడించారు. ఖైదీలను తప్పించడానికి ఏజెంట్లకు సుమారు రూ.57 లక్షలు ఒప్పందం కుదిరినట్లు తమకు సమాచారం అందిందని, ఇది స్పష్టమైన అవినీతి అని అన్నారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos