బీర్లు తాగుతూ చికెన్‌ తింటూ అమ్మాయిల హల్‌చల్‌..

బీర్లు తాగుతూ చికెన్‌ తింటూ అమ్మాయిల హల్‌చల్‌..

స్కూల్‌కు వెళ్లి పుస్తకాలు పట్టుకోవాల్సిన అమ్మాయిలు మైదానానికి వెళ్లి చేతిలో బీర్లు,పక్కనే చికెన్‌ ముక్కలు పట్టుకొని తీసుకున్న వీడియో తమిళనాడులో వైరల్‌గా మారింది. తమిళనాడులోని అరియలూరు జిల్లాలోని ప్రభుత్వ స్కూల్ లో చదువుతున్న ఐదు మంది అమ్మాయిలు ఇటీవల ఇంటి నుంచి స్కూల్ కు బయలుదేరారు. అయితే అమ్మాయిలు స్నేహితులతో కలిసి స్కూల్ కు వెళ్లకుండా ఎగనామం పెట్టారు. స్కూల్ అమ్మాయిలు అందరూ కలిసి ఓ చోట మీటింగ్ పెట్టారు.స్కూల్ కు వెళ్లకుండా నామం పెట్టిన అమ్మాయిలు బీర్ బాటిల్స్, చికెన్, చిప్స్ తో పాటు మందులోకి తినడానికి వివిద రకాల ఆహారపదార్థాలు తీసుకున్నారు. తరువాత సమీపంలోని అటవి ప్రాంతంలోని వెళ్లి ఎలాంటి భయం లేకుండా దర్జాగా బీర్ బాటిల్స్ ఓపెన్ బీర్‌ తాగుతూ చికెన్, చిప్స్ తింటూ అమ్మాయిలు ఎంజాయ్ చేశారు. ఐదు మంది అమ్మాయిలు బీరు తాగుతున్న సమయంలో పక్కన మరో ఇద్దరు స్నేహితులు ఉన్నారు.స్కూల్ అమ్మాయిలు బీరు తాగుతున్న సమయంలో పక్కనే ఉన్న వారి స్నేహితులు ఇద్దరు వీడియోలు తీశారు. అనంతరం ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అరియలూరు జిల్లా స్కూల్ అమ్మాయిలు యూనీఫాంలో బీరు తాగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.స్కూల్ అమ్మాయిల బీరు తాగే ఎపిసోడ్ వీడియోలు వైరల్ కావడంతో విద్యాశాఖా అధికారులు సీరియస్ అయ్యారు. యూనీఫాంలో బీర్లు తాగుతున్న అమ్మాయిలు అరియలూరు ప్రభుత్వ స్కూల్ లో విద్యాభ్యాసం చేస్తున్నారని గుర్తించారు. మార్చి నెలలో స్కూల్ లో అమ్మాయిలకు పరీక్షలు జరుగుతున్నాయని, అందు వలన వారి మీద ఇప్పుడే కఠిన చర్యలు తీసుకోమని, వారి కుటుంబ సభ్యులను పిలిపించి వార్నింగ్ ఇచ్చామని స్కూల్ యాజమాన్యం తెలిపింది. యూనీఫాంలో బీర్లు తాగిన స్కూల్ అమ్మాయిల మీద పరీక్షలు పూర్తి అయిన వెంటనే చర్యలు తీసుకుంటామని తమిళనాడు విద్యాశాఖ అధికారులు, స్కూల్ యాజమాన్యం తెలిపింది.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos