4.79 ల‌క్ష‌ల కోట్లతో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌బ‌డ్జెట్‌

4.79 ల‌క్ష‌ల కోట్లతో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌బ‌డ్జెట్‌

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని యోగి ఆదిత్య‌నాథ్ ప్ర‌భుత్వం ఇవాళ అసెంబ్లీలో 4.79 ల‌క్ష‌ల కోట్ల బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఆర్థిక మంత్రి రాజేశ్ అగ‌ర్వాల్ ఈ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. గ‌త ఏడాదితో పోలిస్తే 12 శాతం ఎక్కువ. ఆర్థిక మంత్రి రాజేశ్ త‌న బ‌డ్జెట్ ప్ర‌సంగంలో అనేక కొత్త ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టించారు. గోర‌ఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వే అభివృద్ధి కోసం వెయ్యి కోట్లు కేటాయించారు. పూర్వాంచ‌ల్ ఎక్స్‌ప్రెస్ వే కోసం 1194 వేల కోట్లు, బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే కోసం వెయ్యి కోట్లు కేటాయించారు. క‌న్యా సుమ‌న్ యోజ‌న కోసం 1200 కోట్లు, స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కోసం 758 కోట్లు కేటాయించారు. విమానాశ్ర‌యాల అభివృద్ధి కోసం వెయ్యి కోట్లు కేటాయించారు. అయోధ్య‌లో నిర్మించ‌బోయే ఎయిర్‌పోర్టుకు 200 కోట్లు ప్ర‌క‌టించారు. అర‌బిక్‌-ప‌ర్షియ‌న్ భాష‌ల ఆధునీక‌ర‌ణ కోసం 459 కోట్లు కేటాయించారు. యోగి ప్ర‌భుత్వం బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డం ఇది మూడ‌వ‌సారి.రాష్ట్రంలోని గోశాల‌ల నిర్వ‌హ‌ణ కోసం సుమారు 650 కోట్లు కేటాయించారు. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos