ముళ్లపొదల్లో రూ.36 లక్షలు..

ముళ్లపొదల్లో రూ.36 లక్షలు..

దొంగలు దోచుకున్న డబ్బుని బీరువాల్లోను బ్యాగుల్లోను దాచుకుంటారు. కానీ కొంతమంది అతితెలివి ఉన్న దొంగలు మాత్రం తాము దోచుకున్నడబ్బుని ముళ్లపొదల్లో దాచారు. కానీ దొంగలకు బ్యాడ్ లక్ తో అవి కాస్తా పోలీసుల కళ్లబడటంతో గుట్టంతా రట్టైంది.ఈ ఘటన కర్నాటకలో జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిత్రదుర్గ జిల్లా చల్లకెరె తాలూకాలోని బుక్లోరహల్లి గ్రామంలోని వ్యవసాయ భూమికి సమీపంలో ఉన్న ముళ్ల పొదల్లో రూ. 36 లక్షలు విలువచేసే నోట్ల కట్టలు దొరికాయి. ఇవి రూ. 50, రూ. 100, రూ. 2000 విలువతో ఉన్న నోట్ల కట్టలు. కొన్ని రోజుల క్రితం బుక్లోరహల్లి గ్రామానికి సమీపంలో ఉన్న దిలీప్ బిల్డ్ కాన్ లిమిటెడ్‌ సంస్థకి చెందిన ఆఫీస్ నుంచి రూ.36 లక్షలు చోరీ అయ్యాయి. ఆ సొమ్మే ముళ్ల పొదల్లో లభ్యమైంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos